టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో అల్లు అర్జున్ (Allu Arjun). మొదటి నుండి డిఫెరెంట్ కాన్సెప్ట్ లతో చిత్రాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉన్నారు. అదే హార్డ్ వర్క్ తో నేషనల్ అవార్డ్ ను కూడా సొంతం చేసుకున్నారు. బన్నీ కెరీర్ లో కీలక మైలు రాయి గా నిలిచిన చిత్రాల్లో ఆర్య కి ప్రత్యేక స్థానం ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది.
ఆర్య చిత్రం మే 7, 2024 వ తేదీన 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భం గా నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి బన్నీ, సుకుమార్, దిల్ రాజు లు హాజరు కానున్నారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొనేందుకు ఇది చక్కటి ఈవెంట్ అని చెప్పాలి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అధ్బుతమైన సంగీతం అందించారు. అనురాధ మెహతా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో శివ బాలాజీ కీలక పాత్రలో నటించారు.