తరుణ్ భాస్కర్ తో మంచు లక్ష్మి ఆహా భోజనంబు

Published on Aug 3, 2021 9:00 pm IST

ఆహా వీడియో సరికొత్తగా మొదలు పెట్టిన ఆహా భోజనంబు పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే విశ్వక్ సేన్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ లతో కార్యక్రమం నిర్వహించిన మంచు లక్ష్మి, ఇప్పుడు మూడవ ఎపిసొడ్ ను డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో నిర్వహించడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం ఆహా వీడియో సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది.

అయితే తరుణ్ భాస్కర్ ఈ ఎపిసొడ్ లో వంట చేయడం తో పాటుగా ఇంకెన్ని విషయాలను ప్రేక్షకులకు తెలిపేందుకు సిద్దం అయ్యారు. ఆగస్ట్ 6 వ తేదీన ఈ ఎపిసొడ్ ఆహా వీడియో లో స్ట్రీమ్ కానుంది. అయితే ఆహా వీడియో సరికొత్తగా మొదలు పెట్టిన ఈ ప్రోగ్రాం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇంకా చాలామంది సెలబ్రిటీ లు ఈ కార్యక్రమం కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :