‘దాస్ కా ధమ్కీ’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

‘దాస్ కా ధమ్కీ’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Apr 6, 2023 9:02 PM IST

యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా అందాల నటి నివేతా పేతురాజ్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దాస్ కా ధమ్కీ. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్స్ పై విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన దాస్ కా ధమ్కీ బాక్స్ఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. యాక్షన్, థ్రిల్లింగ్, ఎంటర్టైన్మెంట్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీలో రావు రమేష్, హైపర్ ఆది, రంగస్థలం మహేష్, రోహిణి, అజయ్ తదితరులు కీలక పాత్రలు చేయగా లియోన్ జేమ్స్, రామ్ మిరియాల సంగీతం అందించారు.

ప్రసన్న కుమార్ బెజవాడ కథని అందించిన ఈ మూవీ లో విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ పోషించగా కీర్తి పాత్రలో కనిపించారు నివేతా. అయితే విషయం ఏమిటంటే, ఏప్రిల్ 14న ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా లో ప్రసారం కానుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆహా టీమ్ నుండి అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. అయితే మాస్క్డ్ పిక్ తో ఒకింత డిఫరెంట్ గా ఆహా వారు దాస్ కా ధమ్కీ ఓటిటి రిలీజ్ డేట్ ని ప్రకటించడం జరిగింది. మరి ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ ని ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు