సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అహం బ్రహ్మస్మి’ట్రైలర్ రిలీజ్..!

Published on Jul 17, 2021 10:00 am IST

విభిన్న కథలతో ఈ మధ్య పలు భాషల్లో అనేక వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులో మాత్రం ఇప్పటివరకు గొప్పగా చెప్పుకోదగ్గ వెబ్ సిరీస్‌లు రాలేదనే చెప్పాలి. అయితే ఆ లోటును భర్తీ చేసేందుకు ‘అహం బ్రహ్మస్మి’ అనే వెబ్ సిరీస్ రాబోతోంది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సిరీస్‌ను మొత్తం 11 భాగాలుగా లెటర్ బాక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిస్తుండగా, సిద్ధార్థ్ పెనుగొండ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే వెబ్ గేమింగ్ నేపథ్యంలో ఈ సిరీస్‌ను రూపొందించారు. గేమ్ లో గెలిస్తే భారీ నగదు, ఓడితే మాత్రం ప్రాణాలు పోవడం ఖాయం. ఇట్లాంటి డేంజరస్ గేమ్ ను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి, ఆ ప్రయత్నంలో ఎలాంటి సంఘటనలు, మలుపులు చోటు చేసుకున్నాయన్న వాటిని చక్కని స్క్రీన్ ప్లే తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. రజత్ రాఘవ్, మౌనిమ, అభయ్ బేతగంటి, చాందినీరావు, సాయి కేతన్ రావు, కృష్ణతేజ తదితరులు ఈ సిరీస్‌లో నటించారు.

అయితే ఈ సిరీస్‌కి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించగా, తాజాగా సీనియర్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఏషియన్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ నారాయణదాస్ నారంగ్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. భారీ అంచనాలున్న ఈ వెబ్ సిరీస్ ఈ నెల 18వ తేది నుంచి అమెజాన్ ప్రైమ్(యూ.ఎస్), అమెజాన్ ప్రైమ్(యూ.కే), ఎమ్.ఎక్స్ ప్లేయర్, హంగామా, ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్, విఐ వంటి పలు ఓటిటి ప్లాట్ ఫామ్స్ నుంచి స్ట్రీమ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం :