ఎయిర్‌టెల్ బ్యూటీకి లక్కీ ఛాన్స్.. ప్రభాస్ మూవీలోనే..!

Published on Aug 3, 2021 1:30 am IST

ఎయిర్‌టెల్ యాడ్‌లో కనిపించే సాషా చెత్రీ గురుంచి చాలా మందికి తెలిసే ఉంటుంది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ తాజాగా లక్కీ ఛాన్స్ కొట్టేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” సీనిమాలో సాషా నటిస్తుంది.

అయితే ఈ చిత్రంలో సాషా ముఖ్యపాత్ర పోశించిందని, ఆమె పాత్ర కథలో కీలకమైనదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే గతంలో ఆది సాయికుమార్‌ హీరోగా నటించిన “ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌” చిత్రంలో కూడా సాషా మెరిసింది. అయితే ఆ సినిమా సాషాకు పెద్దగా గుర్తింపు ఇవ్వలేకపోయింది. అయితే ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా సినిమా అయిన ఆమెకు గుర్తింపు తీసుకొస్తుందో లేదో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :