మణిరత్నం మల్టీస్టారర్ మూవీ నిజమేనంటున్న ఐశ్వర్య

Published on May 26, 2019 4:00 am IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కించనున్నాడని కొన్ని నెలలుగా సౌత్ ఇండియా మొత్తం చెప్పుకొంటోంది.కానీ ఆ సినిమా గురించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇంత వరకు వెలువడింది లేదు. ఐతే తాజాగా ఐశ్వర్యారాయ్ ఈ విషయం పై స్పందించారు.

కేన్స్ ఫెస్టివల్ లో పాల్గొనడానికి ఫ్రాన్స్ వెళ్లిన ఐశ్వర్యారాయ్ అక్కడ విలేకరుల సమావేశంలో తన గురువుగారైన మణిరత్నం సినిమాలో నటించబోతున్నట్లు చెప్పి, ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న అనుమానాలను నివృత్తి చేశారు.వైవిధ్యమైన ఆసక్తిని రేపేలా ఉండే నందిని అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తానన్న ఐశ్వర్య, ఈ మూవీ ఎప్పుడు మొదలౌతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుందంట.

ఐశ్వర్య తో పాటు విక్రమ్,కార్తీ , , కీర్తి సురేష్ ఇంకా కొందరు ప్రముఖ నటులు నటించనున్న ఈ భారీ మల్టీస్టారర్ ని కల్కి కృష్ణమూర్తి రచించిన ఓ ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కించనున్నారంట.

సంబంధిత సమాచారం :

More