పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమాలో ఓ కీలక రోల్ ఉందని.. సినిమాలో పవన్ ను చూసి ఓ గిరిజిన యువతి ప్రేమలో పడుతుందని.. కాగా ఆ ప్రేమించే హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ను తీసుకోవాలనే ఆలోచనలో క్రిష్ ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. కాగా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి.
అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటు రాజకీయాలతో పాటు అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కూడా ఒప్పుకున్నారు. ఇప్పటికే వేణు శ్రీరామ్ మరియు హరీష్ శంకర్ లతో కూడా పవన్ సినిమాలు చేస్తున్నాడు.


