భిన్నమైన సినిమా చూడాలనుకునే వాళ్ళకే ఈ ‘ఆర్ఎక్స్ 100’ !

భిన్నమైన సినిమా చూడాలనుకునే వాళ్ళకే ఈ ‘ఆర్ఎక్స్ 100’ !

Published on Jul 4, 2018 2:05 PM IST

ajay bhupati

ఈ జూలై నెలలో విడుదలకానున్న సినిమాల్లో ‘ఆర్ ఎక్స్ 100’ కూడ ఒకటి. చిన్న సినిమానే అయినా ట్రైలర్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేయనున్నారు. ఈ సందర్బంగా దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ట్రైలర్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోందని అన్నారు.

అలాగే చిత్రంలో హీరో శివ పాత్ర నిర్లక్ష్య ధోరణిలో సాగుతూ చాలా కఠినంగా ఉంటుందని, హీరోయిన్ పాత్ర అంతకంటే ఎక్కువ కఠినంగా ఉంటుందని, కార్తికేయ, పాయల్ రాజపుత్ పోటీపడి నటించారని అన్నారు. కొత్తదనం, భిన్నమైన సినిమాలు కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పక నచ్చుతుందని అంటూ ఇందులో ఫ్యామిలీ ఆడియన్సుకి కావాల్సిన ఎమోషన్స్ తో పాటు మంచి రొమాన్స్ కూడ ఉంటుదన్నారు.

తాను రామ్ గోపాల్ వర్మ శిష్యుడ్ని కావడం మూలాన ఈ సినిమాలో ఆయన ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుందని, కొత్త వాళ్లతో చేసిన కొత్త తరహా సినిమా అంటూ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాను అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు.

తాజా వార్తలు