‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో జాయిన్ కానున్న స్టార్ నటుడు

Published on Jan 21, 2020 1:00 am IST

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో రామ్ చరణ, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ లెవల్లో రూపొందిస్తున్నారు జక్కన్న. సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావడం కోసం అన్ని పరిశ్రమల నుండి నటీనటుల్ని తీసుకున్నారు. బాలీవుడ్ నుండి ఆలియాతో పాటు స్టార్ నటుడు అజయ్ దేవగన్ ను తీసుకున్నారు.

ఇప్పటికే షూటింగ్ జరుగుతుండగా అజయ్ దేవగన్ ఈరోజు నుండి చిత్రీకరణలో జాయిన్ కానున్నారు. ఇందుకోసం ఆయన కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ యేడాదిలోనే విడుదల చేయనున్నారు. ‘బాహుబలి’ సిరీస్ అనంతరం రాజమౌళి నుండి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దేశ వ్యాప్తంగా అన్ని భాషల సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది.

సంబంధిత సమాచారం :

X
More