“గేమ్ ఛేంజర్”తో పోటీ.. అజిత్ సినిమా డేట్ ఇదేనా?

“గేమ్ ఛేంజర్”తో పోటీ.. అజిత్ సినిమా డేట్ ఇదేనా?

Published on Nov 29, 2024 10:05 AM IST

రానున్న సంక్రాంతి రేస్ లో ఆల్రెడీ పలు భారీ సినిమాలు మన సౌత్ నుంచి లాక్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో గట్టి క్లాష్ మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ల నడుమ ఉంటుంది అని టాక్ ఉంది. అయితే చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న ప్లాన్ చేస్తే అదే డేట్ లో అజిత్ “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమా రాబోతుంది అని స్ట్రాంగ్ రూమర్స్ వచ్చాయి.

కానీ లేటెస్ట్ ట్విస్ట్ గా సంక్రాంతి బరిలో గుడ్ బ్యాడ్ అగ్లీ తప్పుకొని అజిత్ విడా ముయర్చి రేస్ లోకి వచ్చింది. అయితే ఇది ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు కానీ ఈ సినిమా అయితే గేమ్ ఛేంజర్ తో క్లాష్ కి రాబోయేది లేదు అని తెలుస్తుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం చరణ్ సినిమా జనవరి 10న వస్తే అజిత్ సినిమా ఓ రోజు ముందే రానున్నట్టుగా తెలుస్తుంది. అంటే జనవరి 9న విడా ముయర్చి వచ్చే ఛాన్స్ ఉందట. అలాగే ఈ సినిమా తెలుగు రిలీజ్ పై ప్రస్తుతానికి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ లేకపోతే గేమ్ ఛేంజర్ తెలుగులో మరిన్ని థియేటర్స్ దక్కే ఛాన్స్ ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు