మూడు రోజులకే ఆ హీరో మిలియన్ కొట్టాడట

Published on Aug 11, 2019 3:55 pm IST

అజిత్ నటించిన తమిళ చిత్రం నెర్కొండ పార్వై ఈనెల 8న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. హీరో అజిత్ ఈ మూవీలో లాయర్ గా నటించడం జరిగింది. అమితాబ్ ప్రధాన పాత్రలో 2016లో బాలీవుడ్ లో విడుదలై విజయం అందుకున్న పింక్ చిత్రానికి తమిళ రీమేక్ గా నెర్కొండ పార్వై చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఐతే అజిత్ ఇమేజ్ దృష్ట్యా అసలు కథకు దర్శకుడు ఎచ్ వినోత్ మార్పులు చేసి,కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారని సమాచారం.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఈ మూవీని నిర్మించారు. ఐతే శనివారం ముగిసేనాటికి ఓవర్సీస్ లో ఈ మూవీ $1 మిలియన్ మార్క్ వసూళ్లను సాధించిందని సమాచారం. ఈ విషయాన్నీ నిర్మాత బోనీ కపూర్ ట్విట్టర్ లో నేడు పోస్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ చెన్నై సిటీ పరిధిలో 2019 సంవత్సరానికి గాను అత్యధిక మొదటిరోజు వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది.ఈ మూవీకి వస్తున్న ఆదరణ దృష్ట్యా అజిత్ తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నారు అని అంటున్నారందరు

సంబంధిత సమాచారం :