ఆ స్టార్ హీరో కొత్త లుక్ వెనుక రీజన్ ఏమిటో…?

Published on Aug 25, 2019 3:00 am IST

తల అజిత్ రీసెంట్ గా నిర్కొండ పార్వై చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు. ఈ చిత్రం తమిళనాడులో సూపర్ హిట్ గా నిలిచింది. హిందీ చిత్రం పింక్ కి తమిళ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని బోనికపూర్ నిర్మించగా, దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కించడం జరిగింది.

కాగా అదే దర్శకుడు అజిత్ హీరోగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది. ఐతే అజిత్ క్లీన్ షేవ్ లో కొత్తగా కనిపించి అభిమానులను ఆశ్చర్య పరిచారు. గత కొంత కాలంగా అజిత్ తెల్లజుట్టు, పెరిగిన గడ్డంతో కనిపిస్తున్నారు. మూవీలలో కూడా ఆయన అదే లుక్ లో దర్శనమిస్తున్నారు. తాజాగా బయటకొచ్చిన లుక్ లో మాత్రం ఆయన క్లీన్ షేవ్ లో కనిపించడం ఆసక్తిరేపుతుంది. అజిత్ తన నెక్స్ట్ మూవీ కొరకు ఇలా మారారా లేక క్యాజువల్ గా షేవ్ చేయించుకున్నారా అనేది తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :