స్టార్ హీరో కోసం ఆ నలుగురు భామలలో ఒకరు..!

Published on Jan 21, 2020 8:08 am IST

కోలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా ఉన్న అజిత్ కుమార్ ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. దర్శకుడు హెచ్ వినోత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా అజిత్ పోలీస్ అధికారి రోల్ చేస్తున్నారు. వాలిమై అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం దాదాపు రెండు నెలలుకు పైగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రంలో అజిత్ సరసన హీరోయిన్ కోసం దర్శక నిర్మాతలు అనేక మంది హీరోయిన్స్ పేర్లు పరిశీలిస్తున్నారట.

ప్రముఖంగా ఇలియానా, కీర్తి సురేష్, హ్యూమా ఖురేషి, యామి గౌతమ్ పేర్లను వీరు పరిగణలోకి తీసుకున్నారట. వీరిలో ఒకరిని అజిత్ కి జంటగా ఈ చిత్రం కొరకు తీసుకోనున్నారు. ఐతే వీరిలో కాలా చిత్రంలో రజిని సరసన నటించిన హ్యూమా ఖురేషి పై ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉన్నారని సమాచారం. తాజా షెడ్యూల్ లో హీరోయిన్ కి సంబందించి సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి వుండటంతో, త్వరగా హీరోయిన్ ని ఫైనల్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. వాలిమై చిత్రాన్ని బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనికపూర్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More