టాక్..”అజిత్ 62″ కి సాలిడ్ టైటిల్..?

Published on Feb 23, 2023 3:02 pm IST

తమిళ్ సినిమా దగ్గర ఉన్న స్టార్ హీరోల్లో భారీ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోల్లో థలా అజిత్ కుమార్ ఒకరు. మరి అజిత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “తునివు” అయితే రిలీజ్ అయ్యి తన కెరీర్ లో మరో పెద్ద హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత అయితే అజిత్ తన కెరీర్ లో 62వ సినిమాగా చేయనుండగా దీనిపై భారీ హైప్ నెలకొంది. కానీ దర్శకుడు ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది.

అయితే ఈ సినిమా నుంచి ఈ మార్చ్ రెండో వారంలో ఓ బిగ్ అనౌన్సమెంట్ వచ్చే ఛాన్స్ ఉందని బజ్ ఉంది. ఇందులో టైటిల్ కూడా రివీల్ కావచ్చని టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఆ టైటిల్ పై సాలిడ్ బజ్ తెలుస్తుంది. మేకర్స్ ఈ సినిమాకి గాను “డెవిల్” అనే పవర్ ఫుల్ టైటిల్ ని అయితే లాక్ చేశారట. మరి దీనిపైనే అధికారిక అప్డేట్ అప్పుడు రానున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించనుండగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :