భారీ రెస్పాన్స్ కొల్లగొట్టిన “వలిమై” మోషన్ పోస్టర్.!

Published on Jul 14, 2021 8:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన థలా అజిత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా “వలిమై”. అజిత్ కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాగా నిలిచిన ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇటీవలే సాలిడ్ అప్డేట్ ని ఇచ్చారు. ముందు చెప్పినట్టుగానే అదిరే మోషన్ పోస్టర్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ మోషన్ పోస్టర్ టీజర్ కి మాత్రం కోలీవుడ్ లోనే తక్కువ వ్యవధిలో సాలిడ్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. మొదటగా ఫస్ట్ 1 మిలియన్ లైక్డ్ మోషన్ పోస్టర్ టీజర్ గా రికార్డు సెట్ చెయ్యగా ఇప్పుడు ఏకంగా 10 మిలియన్ భారీ వ్యూస్ కొల్లగొట్టి ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ కలిగిన మోషన్ పోస్టర్ టీజర్ గా సెన్సేషన్ ను నమోదు చేసింది. మరి ఇదంతా అజిత్ అభిమానుల మహిమే అని చెప్పాలి.

ఎంతో కాలం సుదీర్ఘ విరామం అనంతరం ఈ అప్డేట్స్ రావడంతో వారు ఈ స్థాయి రెస్పాన్స్ అందిస్తున్నారు. మరి అలాగే లేటెస్ట్ గా వచ్చిన మరిన్ని పోస్టర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :