అజిత్ నెక్స్ట్ సినిమా టైటిల్ ఫిక్స్ !
Published on Nov 23, 2017 1:48 pm IST

డైరెక్టర్ శివ హీరో అజిత్ కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. తాజాగా నాలుగోసారి ఈ కాంబినేషన్ లో సినిమా మొదలు కానుంది. ఈ సినిమాకు ‘విశ్వాసం’ టైటిల్ ఫిక్స్ చేసారు. ఇప్పటి వరకు తన తదుపరి చిత్రాన్ని ఎనౌన్స్ చేయని అజిత్, మరోసారి హిట్ కాంబినేషన్ లో పనిచేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది.

డైరెక్టర్ శివ చెప్పిన పాయింట్ నచ్చడంతో అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వీరం, వేదలం, వివేగం లాంటి కమర్షియల్ సక్సెస్ లు వచ్చాయి. సత్య జ్యోతి ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించబోతోంది. ఈ సినిమాకు సంభందించి మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.

 
Like us on Facebook