భారీ ధరకు అమ్ముడైన ‘విశ్వాసం’ థియేట్రీకల్ హక్కులు !

Published on Oct 9, 2018 10:38 am IST


తల అజిత్ నటిస్తున్న ‘విశ్వాసం’చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అజిత్ డ్యూయెల్ రోల్లో నటిస్తున్నాడు. ఇక తమిళంలో అజిత్ – శివ కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పనక్కరలేదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరం, వివేగం’ బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించగా గత ఏడాది వచ్చిన ‘వివేగం’ మాత్రం పరాజయాన్ని చవి చూసింది. అయినా దీని ప్రభావం మాత్రం విశ్వాసం ఫై పడలేదు. ఈ చిత్రం యొక్క తమిళనాడు థియేట్రీకల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ కేజేఆర్ స్టూడియోస్ 48కోట్లకు ఈ హక్కులను దక్కించుకున్నాయి. ఇక త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వెలుబడనుంది.

యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో నయనతార కథనాయికగా నటిస్తుంది. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :