అనుకున్న సమయానికే అజిత్ ఆగమనం

Published on May 18, 2021 9:01 pm IST

అజిత్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘వాలిమై’. లాక్ డౌన్ అనంతరం అజిత్ నుండి వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే శరవేగంగా జరుగుతున్న ఈ షూటింగ్ సెకండ్ లాక్ డౌన్ మూలంగా ఆగిపోయింది. దీంతో సినిమాకు సంబంధించిన అన్ని అప్డేట్స్ వాయిదాపడ్డాయి. షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల కూడ వాయిదాపడ్డట్టేనని డీలాపడుతున్నారు అభిమానులు. అయితే చిత్ర బృందం మాత్రం అభిమానులకు ఆ నిరాశ కలుగకుండా చూడాలని చాలా ట్రై చేస్తున్నారు.

మొదటగా ఆగష్టు మూడవ వారంలో చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు టీమ్. ప్రజెంట్ సిట్యుయేషన్ చూస్తే జూలై నెలలో షూటింగ్స్ రీస్టార్ట్ అయ్యేలా ఉన్నాయి. అప్పటికి మొదలైనా కూడ బ్యాలెన్స్ ఉండేది ఇంకొక చిన్న షెడ్యూల్ మాత్రమే కాబట్టి ఆగష్టు నెలకు కంప్లీట్ చేయడానికి స్కోప్ ఉందని, కాబట్టి ముందుగా అనుకున్న సమయానికే సినిమాన రిలీజయ్యేలా చూడాలని టీమ్ భావిస్తోందట. అజిత్, వినోత్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘నెర్కొండ పారవై’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ నటి హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా తెలుగు యంగ్ హీరో కార్తికేయ నెగెటివ్ రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :