‘లైగర్’ నుండి ‘అక్డి పక్డి’ ఫుల్ సాంగ్ రిలీజ్ …!!

Published on Jul 11, 2022 5:06 pm IST

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్. పూరి జగన్నాథ్ తీస్తున్న ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న లైగర్ లో విజయ్ కిక్ బాక్సర్ గా కనిపించనుండగా రమ్యకృష్ణ ఆయన తల్లి పాత్ర చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుండి అక్డి పక్డి సాంగ్ ప్రోమో యూట్యూబ్ లో రిలీజ్ అయి సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

ఇక నేడు కొద్దిసేపటి క్రితం ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోని రిలీజ్ చేసింది యూనిట్. ప్రోమోలో సూపర్ స్టెప్స్ తో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ, ఫుల్ సాంగ్ లో అనన్య తో కలిసి మరింత జోష్ తో స్టెప్స్ మరింతగా అదరగొట్టారు. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా అద్భుతంగా పాడిన ఈ మాస్ నెంబర్ యువతని మాస్ ని ఎంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి క్రేజ్ తో దూసుకెళుతోంది. కాగా యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న లైగర్ మూవీ ఆగష్టు 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :