ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది “అఖండ 2 తాండవం” (Akhanda 2) అని చెప్పాలి. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా బాలయ్య, బోయపాటి కెరీర్ లో ఒక రికార్డు బ్రేకింగ్ ఓపెనర్ గా నిలిచే విధంగా మొత్తం సెట్ చేసుకుంటుంది. వాయిదా పడితే పడింది కానీ ఆడియెన్స్ లో రెట్టింపు ఉత్సాహం ఈ సినిమా పట్ల ఎక్కువయింది.
బుకింగ్స్ లో ర్యాంపేజ్
అఖండ 2 (Akhanda 2 Thandavam) రెండో సారి ఇలా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో లేదో అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా బాలయ్య తాండవం చూపిస్తున్నారు. అనకాపల్లి నుంచి అమెరికా వరకు లిమిటెడ్ గానే షోస్ ఓపెన్ అయినప్పటికీ ఒక రోరింగ్ రెస్పాన్స్ ఈ బుకింగ్స్ కి వస్తుంది. తెలుగు స్టేట్స్ లో, ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా ఫుల్ గా ఓపెన్ చేయకుండానే బుక్ మై షో ట్రెండింగ్ లో లక్షల్లో టికెట్ లు అఖండ 2 కి తెగుతున్నాయి. దీనితో ఆ మ్యాడ్నెస్ అండ్ ర్యాంపేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
రికార్డ్ ఓపెనింగ్స్ గ్యారెంటీ..
ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ (Akhanda 2 Bookings) తెరుచుకోకుండానే అఖండ 2 రికార్డు మొత్తం నెంబర్ టికెట్స్ ని సేల్ చేసుకుంది. దీనితోనే భారీ ఓపెనింగ్స్ ఖాయమని అర్ధం అయ్యింది. ఇక ఇలా ప్రీమియర్స్ సహా డే 1 కి మొత్తం బుకింగ్స్ తెరుచుకున్నట్టయితే ఈ లెక్కలన్నీ డబుల్, ట్రిపుల్ అవుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనితో అఖండ 2 కి మాత్రం రికార్డు ఓపెనింగ్స్ వస్తాయని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే థమన్ సంగీతం అందించగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించారు.


