నందమూరి బార్న్ కింగ్ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “అఖండ 2 తాండవం”. దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న నాలుగో సినిమా ఇది కాగా దీనిపై నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో ఒక హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఎనలేని హైప్ సెట్టయ్యింది.
ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి రిలీజ్ ఎప్పుడు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఈ సెప్టెంబర్ 25 కి ఫిక్స్ చేశారు కానీ ఇప్పటికీ ఒక్క సాంగ్ కూడా రిలీజ్ చేయలేదు. అప్డేట్స్ లేకపోవడంతో అసలు సినిమా రిలీజ్ సెప్టెంబర్ లో ఉందో లేదో అని అభిమానులు అనుకుంటున్నారు.
అయితే మేకర్స్ కూడా ఇదే మౌనం మైంటైన్ చేయడంతో వాయిదా కన్ఫర్మ్ అనుకోవచ్చు అనేందుకు ఆస్కారం కూడా లేకపోలేదు. ఇంకో వారం పోతే సినిమాకి కేవలం నెలే మిగిలింది. మరి ఈ నెల గ్యాప్ లోనే ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసిన సినిమాని ఎలా విడుదల చేస్తారో చూడాలి.


