గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna) మరికొద్ది గంటల్లో బాక్సాఫీస్ భరతం పట్టేందుకు రెడీ అయ్యారు. ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘అఖండ 2’(Akhanda) పెయిడ్ ప్రీమియర్స్‌తో రేపు(డిసెంబర్ 11) రాత్రి 8 గంటల నుండి థియేటర్లలో సందడి చేయనుంది. బాలకృష్ణ మాస్, బోయపాటి టేకింగ్ కలగలిసి ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయం అంటున్నారు నందమూరి అభిమానులు.
ఇక రిలీజ్‌కు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో మేకర్స్ కూడా ఈ సినిమాపై మరింత హైప్ పెంచుతూ తాజాగా రిలీజ్ టీజర్ వదిలారు. ఈ కొత్త టీజర్ ఆద్యంతం పవర్‌ఫుల్‌గా కట్ చేశారు మేకర్స్. బాలయ్య తనదైన మార్క్ ఎనర్జీ తో మరోసారి రెచ్చిపోయారు. ఇక ఆయన చెప్పే డైలాగులు, థమన్(Thaman) బీజీఎం.. చూస్తుంటే థియేటర్లలో పరిస్థితి ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ఏర్పడుతోంది. యాక్షన్‌కు కూడా ఎక్కడ ఢోకా లేకుండా ఈ సినిమాను రూపొందించినట్లు ఈ టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.
థియేటర్లలో బాక్సులు బద్దలు కావడం ఖాయమని ఈ కొత్త టీజర్ చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తుండగా సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్‌గా ప్రొడ్యూస్ చేశారు. ఇక అఖండ 2(Akhanda 2) బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి తాండవం చేయనుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
THE UNSTOPPABLE DIVINE ROAR ????????????#Akhanda2 GRAND RELEASE TEASER out Now!
Book your tickets now!
????️ https://t.co/8l5WolzzT6In theatres from ???????????????????????????????? ???????? with grand premieres on December 11th ????????#Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna… pic.twitter.com/dVDff9JDD9— 14 Reels Plus (@14ReelsPlus) December 10, 2025


