ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ‘అఖండ 2’(Akhanda 2) మేనియా నడుస్తోంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ‘అఖండ’ గ్రాండ్ విజయం తర్వాత ‘అఖండ 2’ కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
డే1 కలెక్షన్స్ ఇవే..
కాగా, ఈ చిత్రం డిసెంబర్ 12న భారీ స్థాయిలో రిలీజ్ అవగా దీనికి ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమాకు కేవలం నైజాం ప్రాంతంలో ప్రీమియర్స్ కలుపుకుని తొలిరోజు వచ్చిన షేక్ కలెక్షన్స్ రూ.5.85 కోట్లు అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇక వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ ఏకంగా రూ.59.5 కోట్ల వసూళ్లు సాధించి బాలయ్య(Balayya) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌గా నిలిచాయి.
పుంజుకోవడం ఖాయం..
అఖండ 2(Akhanda 2) కలెక్షన్స్ వీకెండ్ ముగిసే సరికి మరింత జోరందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బాలయ్య ఊరమాస్ పర్ఫార్మెన్స్‌కు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. సంయుక్త హీరోయిన్‌గా హర్షాలి మల్హోత్ర కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేశారు.


