నార్త్‌లోనూ స్ట్రాంగ్ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్న ‘అఖండ 2’

నార్త్‌లోనూ స్ట్రాంగ్ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్న ‘అఖండ 2’

Published on Dec 12, 2025 8:00 PM IST

akhanda 2

పలు వాయిదాలు, వివాదాలు ఎదుర్కొన్న తర్వాత బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ‘అఖండ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింహా, లెజెండ్, అఖండ తర్వాత బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సినిమా కావడంతో భారీ హైప్ నెలకొంది. పాన్-ఇండియా రిలీజ్‌తో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ దేశవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో నిర్మాతలు రామ్ అచంట, గోపీ ఆచంట ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఉత్తర భారతదేశంలో 800 స్క్రీన్స్‌లో సినిమా విడుదలై, సుమారు 30% ఓపెనింగ్స్ సాధించిందని తెలిపారు. హిందీ బెల్ట్ ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్ల నుండి వచ్చిన స్పందన చాలా ఉత్తేజకరంగా ఉందని వారు పేర్కొన్నారు.

ఈ చిత్రానికి హిందీ డిస్ట్రిబ్యూషన్‌ బాధ్యతలను జీ స్టూడియోస్ నిర్వహించింది. హిందీలో కూడా సినిమా మంచి రన్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నట్లు టీమ్ తెలిపింది. ‘బజరంగీ భాయిజాన్’ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హర్షాలీ మల్హోత్రా ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సంయుక్త, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు