తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 తాండవం.. ప్రీమియర్స్‌తోనే టాపు లేచింది..!

తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 తాండవం.. ప్రీమియర్స్‌తోనే టాపు లేచింది..!

Published on Dec 12, 2025 5:03 PM IST

Akhanda-2 Movie

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’ అన్ని అడ్డంకులను దాటుకుని నిన్న(డిసెంబర్ 11) రాత్రి ప్రీమియర్ షోల రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ చిత్ర ప్రీమియర్ షోలను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు.

దీంతో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం ప్రీమియర్ షోల రూపంలోనే దాదాపు రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కినట్లు చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని.. ఇక ఈ వీకెండ్ ఈ సినిమా కలెక్షన్స్ మరింతగా పెరుగుతాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో బాలయ్య నట విశ్వరూపం ప్రేక్షకులను స్టన్ చేస్తుందని.. బోయపాటి టేకింగ్, థమన్ థండరింగ్ సౌండ్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసిందని వారు తెలిపారు. సంయుక్త, హర్షాలి మల్హోత్ర, ఆది పినిశెట్టి తదితరులు ఇతర కీలక ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ వారు ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు