‘అఖండ 2’ ర్యాంపేజ్.. కొత్త ఏడాది బుకింగ్స్ లో ట్రెండింగ్

‘అఖండ 2’ ర్యాంపేజ్.. కొత్త ఏడాది బుకింగ్స్ లో ట్రెండింగ్

Published on Jan 2, 2026 12:00 AM IST

Akhanda

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన డివోషనల్ డ్రామా చిత్రమే అఖండ 2 తాండవం. మంచి బజ్ నడుమ రిలీజ్ కి తీసుకొచ్చిన ఈ సినిమా ఊహించని నెగిటివ్ ని కూడా మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా ఇప్పటికీ తెలుగు స్టేట్స్ లో మంచి రెస్పాన్స్ ని అందుకుంది.

మధ్యలో కొత్త రిలీజ్ లు వచ్చినప్పటికీ అఖండ 2 తట్టుకొని బుకింగ్స్ పరంగా రాణించింది. నిజానికి ఈ సినిమా పొటెన్షియల్ కి తగ్గ రేంజ్ లో ఇంకా ఎక్కువ ఉండాలి కానీ వాంటెడ్ నెగిటివిటీ మూలాన ఈ సినిమాకి దెబ్బ పడింది. మరి షాకింగ్ గా లేటెస్ట్ గా ఈ సినిమా ఈ జనవరి 1 హాలిడే రోజు సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది. బుక్ మై షోలో ఈ సినిమా టికెట్ ట్రెండింగ్స్ లో 24 గంటలు, హవర్లి బుకింగ్స్ చూపిస్తుంది. మరి అంత జరిగినా కూడా ఈ సినిమా ఇలాంటి రెస్పాన్స్ అందుకోవడం అనేది చిన్న విషయం అయితే కాదనే అనుకోవాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు