టాక్: ఆ మాట బేస్‌గా అఖండకు సీక్వెల్?

Published on Dec 7, 2021 9:43 pm IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకుని కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమాకి సీక్వెల్‌ వస్తుందా అనే అంశం ఇండస్ట్రీ తెరపైకి వచ్చింది.

అదేలా అంటే సినిమా క్లైమాక్స్‌లో అఖండ ‘ఈ జన్మకి శివుడే నాకు తండ్రి’, ‘ఆ లోకమాతే నాకు తల్లి’ అంటూ తన బంధాలన్నిటిని తెంచుకుని వెళ్ళిపోతాడు. అయితే వెళ్లేటప్పుడు బాలకృష్ణ కూతురికి ‘నీకు ఆపద వచ్చినప్పుడు నీ ముందు ఉంటాను’ అని అఖండ ఓ మాట ఇస్తాడు. అయితే ఆ మాట బేస్ చేసుకుని పాపకు ఏదైనా సమస్య వస్తే, అఖండ మళ్లీ వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తుంది. మరి నిజంగా సీక్వెల్ కనుక వస్తే బాలయ్య అభిమానులకు మరో పండగే అవుతుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :