పూజాని తనని గుర్తు పట్టలేరంటున్న అఖిల్.!

Published on Sep 18, 2020 1:24 pm IST

ప్రస్తుతం అక్కినేని యువ హీరో అక్కినేని అఖిల్ మరియు పూజా హెగ్డేలు హీరో హీరోయిన్స్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్”. మంచి అంచనాలను ఏర్పర్చుకున్న ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల షూట్ ను అందాక నిలుపుకొని ఆరు నెలల తర్వాత ఇటీవల మళ్ళీ మొదలయ్యింది. ఆ విషయాన్నీ పూజ హెగ్డేనే తన బృందంతో కలిపి ఉన్న ఒక ఫోటో ద్వారా తెలిపింది.

అయితే ఇప్పుడు అఖిల్ మాత్రం ఒక ఫన్నీ పోస్ట్ ను పెట్టారు. “మళ్ళీ షూట్ లో పాల్గొననుండడం గ్రేట్ ఫీల్ లా ఉందని, పూజా తాను మాత్రమే మాస్క్ లేకుండా ఉన్నామని లేదా మీరెవరూ మమ్మల్ని గుర్తు పట్టలేరని” పోస్ట్ చేసి ఇద్దరిది కలిపి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసాడు. మంచి హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More