ఈ “మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్” ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడే.!

Published on Oct 25, 2020 1:08 pm IST

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన లేటెస్ట్ యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం “మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్”. అఖిల్ దీనికి ముందు చేసిన సినిమాలు బాక్సాఫీస్ పరంగా ఆకట్టుకోకపోయినప్పటికీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై మాత్రం మంచి హైప్ ను తెచ్చుకోగలుగుతున్నాడు. ఇలా ఇప్పుడు చేస్తున్న “మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్” పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు “బొమ్మరిల్లు” భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తాలూకా టీజర్ ఇపుడు దసరా కానుకగా విడుదలయ్యింది.

పెళ్లి జీవితంపై పూర్తి భిన్నమైన ఓపీనియన్స్ కలిగిన ఇద్దరు యువతీ యువకులు కలిస్తే? బహుశా వారిద్దరికీ లవ్ పుట్టి పెళ్ళైతే అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ పై ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు అనిపిస్తుంది. జస్ట్ సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రం అనిపిస్తుంది. ఈ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే సంక్రాంతి రేస్ లో ఈ చిత్రాన్ని నిలపనున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More