ఘనంగా అక్కినేని అఖిల్ నిశ్చితార్థ వేడుక!

10th, December 2016 - 09:25:07 AM

akkineni-family

అక్కినేని నాగార్జున రెండవ కుమారుడు, హీరో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే మనవరాలు, సోమనాద్రి భూపాల్ కుమార్తె శ్రియా భూపాల్ తో నిన్న డిసెంబర్ 9 సాయంత్రం 7 గంటల సమయంలో హైదరాబాద్ లోని జీవీకే హౌస్ లో వైభవంగా జరిగింది. ఈ వేడుక అతి కొద్ది మంది కుటుంబ ఆప్తుల సమక్షంలో ప్రైవేట్ ఫంక్షన్ లా జరిగింది. ఈ వేడుకలో అఖిల్, శ్రియల జంట తరువాత చాయత్న్యా, సమంతల జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న అఖిల్, శ్రియా భూపాల్ ల ప్రేమను పెద్దలు ఈ మధ్యనే మనస్ఫూర్తిగా అంగీకరి పెళ్ళికి ఓకే చెప్పారు.

ఇక వీరి వివాహన్ని వచ్చే సంవత్సరం రోమ్ నగరంలో భారీ ఎత్తున చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. వీరి వివాహం అనంతరం నాగ చైతన్య, సమంతల వివాహం జరగాల్సి ఉంది. ఇకపోతే అఖిల్ ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తాజాగా ఒక సినిమానై ఓకే చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించనున్న ఈ చిత్రంలో నూతన నటి మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటించనున్నారు