‘పూజా హెగ్డే’ కోసం షూటింగ్ ని !

Published on Aug 28, 2019 1:02 am IST

‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. దాంతో తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. కాగా తన తర్వాత సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ ఫిక్స్ అయింది. ఇప్పటికే చాలమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించి చివరికీ పూజా హెగ్డేను హీరోయిన్ గా ఫైనల్ చేసింది చిత్రబృందం. అయితే పూజా డేట్లు ప్రస్తుతం ఖాళీ లేకపోవడంతో చిత్రబృందం ఏకంగా షూటింగ్ నే పోస్ట్ ఫోన్ చేసుకుంది. పైగా పూజా హెగ్డే ఖాళీగా ఉన్న డేట్ లు చూసుకుని.. ఆ డేట్స్ లోనే తమ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేసుకుంటున్నారు అఖిల్ అండ్ భాస్కర్.

కాగా తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ లో వారం రోజులు, మరియు నవంబర్ లో మరో పది రోజులు అఖిల్ సినిమాకి డేట్లు కేటాయించిందట పూజాహెగ్డే. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :