
అక్కినేని ఫ్యామిలీ నేటితరం నట వారసుడు అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ చిత్ర టీం ఏ మాత్రం గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ జరుపుతోంది . గతకొద్ది వారాలుగా ఈ చిత్ర టీం స్పెయిన్ లోని అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీం ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయడానికి సిద్దమైంది. ప్రస్తుతం స్పెయిన్ లో అఖిల్ పై వచ్చే ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. ఫైట్ మాస్టర్ రవి వర్మ ఈ యాక్షన్ ఎపిసోడ్ ని కంపోజ్ చేస్తున్నాడు.
అఖిల్ ఇప్పటి వరకూ సినిమా చాలా బాగా రావడంతో చాలా హ్యాపీగా ఉన్నాడు. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాలో అఖిల్ పూర్తి రఫ్ అండ్ టఫ్ మాస్ కుర్రాడిగా కనిపించనున్నాడు. మాస్ ని విపరీతంగా మెప్పించే వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. ఈ స్పెయిన్ షెద్యోల్ లో సీన్స్ తో పాటు ఒక రెండు పాటలని కూడా షూట్ చేయనున్నారు. యంగ్ హీరో నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి తమన్ – అనూప్ రూబెన్స్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.

