అక్కినేని అఖిల్ ఫుల్ హ్యాపీస్.!

అక్కినేని అఖిల్ ఫుల్ హ్యాపీస్.!

Published on May 7, 2015 5:27 PM IST

akhil1
అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్నా మరో యంగ్ అండ్ హన్డ్సం హీరో అక్కినేని అఖిల్. ఈ నవతరం హీరోని తెలుగు తెరకు పరిచయం చేయనున్న మొదటి సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. అక్కడి అందమైన లోకేషన్స్ లో కొన్ని పాటలతో పాటు సినిమాలోని కీలకమైన సీన్స్ ని కూడా షూట్ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటి వరకూ తెరకెక్కిన విషయంలో అఖిల్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. అఖిల్ వినాయక్ టేకింగ్ పరంగా, తనని ప్రెజెంట్ చేస్తున్న విషయంలో కూడా ఫుల్ హ్యాపీస్.

‘స్పెయిన్ లో షూటింగ్ చేస్తున్నాను. నా మొదటి సినిమా ఫస్ట్ అబ్రాడ్ షెడ్యూల్ ఇది. అమేజింగ్ టీం మెంబర్స్ తో పనిచేస్తున్న ఫీలింగ్ సూపర్బ్. ఈ రోజు ఓ ఫోటో పోస్ట్ చేస్తానని’ అఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అఖిల్ సరసన సయేష సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. వివి వినాయక్ సినిమా షెడ్యూల్స్ లో ఏ మాత్రం గ్యాప్ లేకుండా చాలా వేగంగా షూటింగ్ ఫినిష్ చేస్తున్నాడు. అఖిల్ ఫాదర్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్న ఈ సినిమాని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ – అనూప్ రూబెన్స్ కలిసి సంగీతం అందిస్తున్నాడు. వెలిగొండ శ్రీనివాస్ కథని అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ డైలాగ్స్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు