శర్వానంద్ పక్కన అఖిల్ హీరోయిన్ !

శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సుదీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్న ఈ హీరో త్వరలో డైరెక్టర్ హను రాఘవపుడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చెయ్యబోతునట్లు తెలుస్తోంది. సుదీర్ వర్మ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ముందుగా ఈ మూవీలో కాజల్, నిత్య మీనన్ నటిస్తున్నారని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్స్ చేంజ్ అయ్యారని సమాచరం. హలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రి ఇచ్చిన కళ్యాణి శర్వానంద్ సరసన నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అండర్ వరల్డ్ డాన్ గా శర్వానంద్ ఈ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాతో పాటే హను సినిమా షూటింగ్ లో పాల్గోనబోతున్నాడు ఈ హీరో.