అఖిల్ ఆ డైరెక్టర్ తో ఫిక్స్ అయినట్లే !

Published on Feb 18, 2019 10:08 pm IST

భారీ హిట్ కోసం అక్కినేని అఖిల్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోని చేసిన ‘మిస్టర్ మజ్ను’ మంచి అంచనాల మధ్య విడుదలై, ఆ అంచనాలను తలక్రిందుల చేస్తూ.. మిక్సడ్ రివ్యూస్ కే పరిమితమైంది. దాంతో అఖిల్ తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం అఖిల్ తన తర్వాత సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు కథ కూడా ఫైనల్ అయిందట. ఆ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మించనుంది.

అయితే దర్శకుడు పరశు రామ్ తో అఖిల్ తన తరువాత సినిమా చేస్తాడని రూమర్స్ వచ్చినా.. చివరికి భాస్కర్ తో ఫిక్స్ అయ్యాడు అఖిల్. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :