మిస్టర్ మజ్ను వెనక్కివెళ్లిపోయాడా ?

Published on Oct 9, 2018 4:00 am IST

అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ 21న విడుదల చేద్దామనుకున్నారు. కానీ అదే రోజు వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ అలాగే ‘పడి పడి లేచె మనసు’ తో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా విడుదలవుతుండండంతో ఈచిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేద్దాం అనుకున్నారు. తాజాగా బాలకృష్ణ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రం కూడా అదే రోజున విడుదల అవుతుండడంతో మళ్ళీ ఈ చిత్రాన్ని వాయిదా వేశారని సమాచారం. ఇక ఈచిత్రాన్ని ఫిబ్రవరి లో ప్రేమికుల దినోత్సవం కానుకగా విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట చిత్ర దర్శక నిర్మాతలు.

‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :