అక్కినేని అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, రెండో షెడ్యూల్‌లోని కీలక సన్నివేశాల చిత్రీకరణ దశలో ఉంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్‌లో.. అఖిల్, రాజేంద్ర ప్రసాద్‌ల మధ్య కొన్ని సరదా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇదే షెడ్యూల్‌లో హీరో హీరోయిన్లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. హీరోయిన్ సయేషా, అఖిల్ జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వారిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం. హీరో నితిన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాకు ఎస్. ఎస్. థమన్, అనూప్ రూబెన్స్ ఇద్దరూ సంగీతం సమకూర్చనుండడం విశేషం.


