
ఇప్పటి వరకూ అక్కినేని ఫ్యామిలీ అంటే ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ ని చెరిపేయడానికి ‘అఖిల్’ అనే సినిమాతో అక్కినేని ఫ్యామిలీ నుంచి దూసుకువస్తున్న మూడవతరం నటవారసుడు అఖిల్ అక్కినేని. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ అఖిల్ ని పర్ఫెక్ట్ కమర్షియల్ హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.మొదటి నుంచి ఈ చిత్ర టీం ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, అవి అనుకున్న టైం కి పూర్తి కాని కారణంగా ఈ సినిమాని అక్టోబర్ 22 నుంచి వాయిదా వేస్తున్నామని ఈ చిత్ర నిర్మాత నితిన్ తెలిపాడు.
వాయిదా వేసారు కానీ ఈ చిత్ర టీం అఖిల్ రిలీజ్ కోసం పర్ఫెక్ట్ టైం ని వెతికే పనిలో ఉన్నారు. ఈ చిత్ర టీం సన్నిహిత వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం దీపావళి కానుకగా నవంబర్ 11న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. దసరా సీజన్ మిస్ అయినా దీపావళి సీజన్ ని టార్గెట్ చెయ్యాలనే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉంది. త్వరలోనే దీనిపై అధికారుక ప్రకటన వెలువడనుంది. అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం అయిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తే, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అఖిల్ కూడా ఓ మంచి ప్రోడక్ట్ ని ప్రేక్షకులకు అందించాలనే పోస్ట్ ప్రొడక్షన్ కి ఇంకాస్త సమయం తీసుకున్నాడని సమాచారం.

