ఫిబ్రవరి 9 నుండి అఖిల్ సినిమా రెగ్యులర్ షూటింగ్..?

Akhil-Akkineni12
అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమా ముహూర్త కార్యక్రమాలు జరిగి 45 రోజులు కావొస్తుంది. ఆ తర్వాత సినిమాకు సంబందించిన మరో కబురు లేదు. ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 9 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట.

మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వెలిగొండ శ్రీనివాస్ కథ అందిస్తున్నారు. ఫాంటసీ కథ అని టాక్. కోన వెంకట్ ఈ సినిమాకు మాటలు రాస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ పతాకంపై తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలసి యువహీరో నితిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version