ఎట్టకేలకూ అఖిల్ పూజ చేసేశాడు !

Published on May 24, 2019 7:00 pm IST

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న సినిమా ఈరోజే పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. నాగార్జున, అమల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటించే మిగిలిన నటీనటులు గురించి ఓ క్లారిటీ వచ్చింది. కానీ హీరోయినే ఫిక్స్ కాలేదు.

ఆ మధ్య రష్మికా మండన్నను హీరోయిన్ గా తీసుకోనున్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇంకా రష్మికా ఫైనల్ కాలేదు. ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. కాగా భాస్కర్ బొమ్మరిల్లు సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట.

సంబంధిత సమాచారం :

More