‘బ్యాచ్‌ల‌ర్’ పై సంతృప్తికరంగా ఉన్నారట !

Published on Oct 11, 2021 5:30 pm IST


యంగ్ హీరోయిన్ అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా అక్టోబర్ 15 వ తేదీన రిలీజ్ కి రెడీ అయింది. అయితే, ఈ సినిమా అవుట్ ఫుట్ బాగా వచ్చిందని.. సినిమా చూశాక మేకర్స్ పూర్తి సంతృప్తికరంగా ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో లవ్ ట్రాక్ చాలా బాగా వచ్చిందని.. లవ్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని తెలుస్తోంది.

అలాగే హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందట. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. . గీతా ఆర్ట్స్ 2 పతాకం పై ఈ చిత్రాన్ని బన్నీ వాసు మరియు వాసు వర్మ లు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి చిట్టి అడుగు లిరికల్ సాంగ్ విడుదల అయింది. ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :