అఖిల్ ని చూసి పుత్రోత్సాహంలో ఉన్న నాగ్ – అమల

అఖిల్ ని చూసి పుత్రోత్సాహంలో ఉన్న నాగ్ – అమల

Published on May 19, 2015 8:42 PM IST

Akhil-Akkineni
అక్కినేని ఫ్యామిలీ నుంచి తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి వస్తున్నా నవతరం నట వారసుడు అక్కినేని అఖిల్. పక్కా మాస్ డైరెక్టర్ అయిన వివి వినాయక్ డైరెక్షన్ లో అఖిల్ మొదటి సినిమా చేస్తున్నాడు. అఖిల్ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. నిన్నటి నుంచి స్పెయిన్ లో అఖిల్ పై వచ్చే ఓ స్టైలిష్ అండ్ లావిష్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ ఈ యాక్షన్ ఎపిసోడ్ ని కంపోజ్ చేస్తున్నాడు.

ఏ తల్లి తండ్రులకైనా తమ వారసుడు తమ కళ్ళ ముందు ఒక్కో మెట్టు ఎదుగుతుంటే వాళ్ళు పొందే ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి పుత్రోత్సాహానికే అక్కినేని నాగార్జున – అమల ఈ రోజు లోనయ్యారు. విషయంలోకి వెళితే నాగార్జున – అమల ఈ రోజు స్పెయిన్ లో అఖిల్ షూట్ చేస్తున్న షూటింగ్ స్పాట్ కి వెళ్ళారు. మొదటి సారిగా కెమెరా ముందు యాక్షన్ చేస్తున్న అఖిల్ ని చూసిన నాగార్జున – అమల ఎంతో ఆనందంలో మునిగిపోయారు. అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ హీరో నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి తమన్ – అనూప్ రూబెన్స్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.

తాజా వార్తలు