అఖిరా నందన్ ఈ వీడియో చూశారా?

Published on Aug 3, 2021 11:05 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ తో తనదైన శైలి లో ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటారు. అయితే తన సినిమాల్లో ఫైట్స్ లో కూడా ఏదో ఒక రూపం లో ఈ మార్షల్ ఆర్ట్స్ కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఆయన కుమారుడు అఖిరా నందన్ తాజాగా కసరత్తులు చేస్తున్న వీడియో ను రేణు దేశాయ్ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం జరిగింది. కర్ర తిప్పుతూ కసరత్తులు చేస్తున్న వీడియో ను చూస్తుంటే పవన్ కళ్యాణ్ స్టైల్ కనిపిస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు చెబుతున్నారు. లైక్ ఫాదర్ లైక్ సన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం అఖిరా వీడియో రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :