అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా దర్శకుడు కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే లెనిన్. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం, మరీ ముఖ్యంగా అఖిల్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏజెంట్ ప్లాప్ తర్వాత దాదాపు మూడేళ్ళ తర్వాత అఖిల్ నుంచి ఈ సినిమా రాబోతుండగా లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ తో మాత్రం ఫ్యాన్స్ లో కొత్త కాన్ఫిడెన్స్ వచ్చింది అని చెప్పొచ్చు.
ఇంట్రెస్టింగ్ గానే కాకుండా సినిమాలో మేజర్ ట్విస్ట్ ని కూడా ఇందులో హింట్ ఇస్తూ చూపించడంపై సినిమా రిజల్ట్ పై వారు మంచి నమ్మకాన్ని సెట్ చేసుకున్నారు. సో ఆ అంచనాలు సినిమా అందుకుంటుందో లేదో ఈ జూలై 10 వరకు ఆగితే తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.


