కొత్త సినిమా ప్రకటించిన అక్కినేని హీరో !

హలో సినిమా తరువాత అఖిల్ చెయ్యబోయే సినిమాకు సంభందించి రకరకాల పేర్లు వినిపించాయి. కాని చివరికి తొలిప్రేమ సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు వెంకి అట్లూరి అఖిల్ తో సినిమా చెయ్యబోతున్నాడు ఈ హీరో. ఉగాది సందర్భంగా అఖిల్ ఈరోజు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వెంకి అట్లూరి తొలిప్రేమ సినిమా తరువాత రెండోసారి ఈ బ్యానర్ లో సినిమా చెయ్యబోతున్నాడు.

ఈ నెల 26 న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభంకానుంది. ఏప్రిల్ రెండో వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేసే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. తొలిప్రేమ సినిమాలో వెంకి అట్లూరి రాసిన మాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. మంచి ప్రేమకథను అందంగా ప్రేక్షకులకు చూపించిన ఈ దర్శకుడు అఖిల్ ను ఏ విధంగా చూపిస్తాడో చూడాలి.