‘బెల్‌బాట‌మ్‌’ ట్రైలర్ రిలీజ్.. స్టైలిష్ లుక్‌లో అక్షయ్ కుమార్..!

Published on Aug 4, 2021 12:33 am IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో రంజిత్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బెల్‌బాట‌మ్‌’. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎమ్మా ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వాణీ కపూర్‌, లారా దత్తా, హ్యుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 1984లో ఇండియాలో జ‌రిగిన విమానాల‌ హైజాక్స్ ఘ‌ట‌నల నేపద్యంలో ఈ చిత్రం సాగనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌ అండర్‌ కవర్‌ రా ఏజెంట్‌ ‘బెల్‌బాటమ్‌’గా కనిపించనున్నాడు. బెల్‌బాటమ్‌ అనేది అక్షయ్‌కుమార్ కోడ్‌ నేమ్‌.

అయితే వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్ చాలా స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అప్పటి వరకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్న ఈ ట్రైలర్‌ను మీరు కూడా ఓసారి చూసేయండి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :