కార్గిల్ యుద్ధం పై అక్షయ్ ఆసక్తికర ట్వీట్.

కార్గిల్ యుద్ధం పై అక్షయ్ ఆసక్తికర ట్వీట్.

Published on Jul 26, 2019 5:10 PM IST

చారిత్రాత్మక కార్గిల్ యుద్దానికి ఇరవై ఏళ్ళు. కాశ్మీర్ లోకి పాకిస్తాన్ అక్రమ చొరబాట్లను వ్యతిరేకిస్తూ మే 3న, 1999లో భారత్ దాయాది పాకిస్తాన్ తో తలపడటం జరిగింది. దాదాపు మూడు నెలలు నిరవధికంగా జరిగిన యుద్ధం జులై 26న ముగిసింది.ఎంతో మంది వీర జవానులు ప్రాణత్యాగంతో భారత్ పాకిస్తాన్ పై విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి ఇరవై ఏళ్ళు పూర్తయిన సంధర్బంగా భారత్ కార్గిల్ విజయ్ దివాష్ పేరుతో సంబరాలు జరుపుకుంటుంది.

ఐతే హీరో అక్షయ్ కుమార్ ఈ సందర్బంగా స్పందించి తన దేశ భక్తి చాటుకున్నారు. సాధారణంగా నేను అంతగా పుస్తకాలు చదవను, కానీ కార్గిల్ యుద్ధంలో ధైర్యంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీరసైనికులను స్మరించుకోవడానికి “ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్2” పుస్తకాన్ని తీసుకున్నాను అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. శివ అరోరా, రాహుల్ సింగ్ అనే ఇద్దరు రచయితలు భారత్ పై జరిగిన ఉగ్రదాడులు, అలాగే భారత సైన్యం చేసిన సాహసోపేతమైన సర్జికల్ స్ట్రైక్స్ పై “ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్2” పుస్తకాన్ని రాయడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు