చైనాలో విడుదల అవుతున్న స్టార్ హీరో మూవీ

చైనాలో విడుదల అవుతున్న స్టార్ హీరో మూవీ

Published on Dec 4, 2019 3:00 PM IST

అక్షయ్ కుమార్ నటించిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా గోల్డ్. భారతీయుల జాతీయ క్రీడైన హాకీ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో అక్షయ్ తపన్ దాస్ అనే హాకీ జట్టు అసిస్టెంట్ మేనేజర్ పాత్ర చేశారు. 1936లో బెర్లిన్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు రీమా కంగ్టి. గత ఏడాది విడుదలై పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకున్న ఈ చిత్రం క్రిటిక్స్ నుండి ప్రశంశలందుకుంది. కాగా ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేయనున్నారు నిర్మాతలు. ఈనెల 13న భారీ ఎత్తున గోల్డ్ మూవీ చైనీస్ వర్షన్ అక్కడ విడుదల చేస్తున్నారు. అక్కడ అక్షయ్ కుమార్ స్పోర్ట్స్ డ్రామా ఏమాత్రం ఆదరణ దక్కించుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.

ఈ ఏడాది చైనాలో విడుదల అవుతున్న అక్షయ్ కుమార్ రెండవ చిత్రంగా గోల్డ్ నిలిచింది. ఆయన ప్రతి నాయకుడిగా నటించిన 2.0 సెప్టెంబర్ లో విడుదలయ్యింది. రజని కాంత్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. రీసెంట్ గా హౌస్ ఫుల్ 4 చిత్రంతో హిట్ అందుకున్న అక్షయ్ కుమార్ ఈనెల 27న గుడ్ న్యూస్ అనే కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ తో రానున్నాడు. ఈ ఏడాది ఆయన నటించిన నాలుగవ చిత్రం గుడ్ న్యూస్ కావడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు