సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో !

Published on Jul 6, 2020 2:17 pm IST

కరోనా సంక్షోభంలో కూడా తన సినిమా చిత్రీకరణను ఆపకుండా చేసిన మొదటి స్టార్ హీరో దేశంలోనే అక్షయ్ కుమార్ ఒక్కడే. ఇప్పుడు మరోసారి, అక్షయ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. కరోనా ప్రవాహంలో కూడా మరో సినిమా షూటింగ్ కోసం సమాయత్తమవుతున్నాడు. తన కొత్త చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్తున్నాడు.

వాషు భగ్నాని నిర్మాణంలో అక్షయ్ ‘బెల్ బాటమ్’ అనే సినిమా చేస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే.అయితే, ఆగస్టు నెలలో ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను షూట్ చేయడానికి చిత్రబృందం ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటుంది.

కాగా ఈ చిత్రం పీరియడ్ డ్రామా అట, 1980 నాటి కాలంలో ఈ సినిమా కథ సెట్ చేయబడింది. నిజమైన కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్న ఈ చిత్రంలో హుమా ఖురేషి, వాణి కపూర్ మరియు లారా దత్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More