ముగ్గురు స్టార్ హీరోలు పోలీస్ గెటప్స్ లో

Published on Oct 10, 2019 3:16 pm IST

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ని మూవీ మిషన్ గా చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది మూడు చిత్రాలకు పైగా విడుదల చేశే అక్షయ్ ఇప్పటికే కేసరి, మిషన్ మంగళ్ చిత్రాలను ఈ ఏడాది విడుదల చేయడం జరిగింది. ఇక ఈనెల 25న హౌస్ ఫుల్ 4 చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసిన ఆయన గుడ్ న్యూస్, సూర్యవంశీ, లక్ష్మీ బాంబ్ చిత్రాలలో నటిస్తున్నారు. యాక్షన్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి నిర్మిస్తున్న సూర్యవంశీ చిత్రంలో అక్షయ్ కుమార్ పోలీస్ పాత్ర చేస్తున్నారు.

విశేషం ఏమిటంటే ఈ మూవీలో రణ్వీర్ సింగ్, అజయ్ దేవ్గణ్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. గతంలో రోహిత్ శెట్టి అజయ్ దేవ్ గణ్ తో సింగం చిత్రం చేశారు అలాగే, రణ్వీర్ తో సింబా మూవీ చేయడం జరిగింది. ఈ రెండు చిత్రాలలోని భాజీ రావ్ సింగం, సంగ్రామ్ భాలే రావ్ పాత్రలలో రణ్వీర్, అజయ్ మళ్ళీ చేస్తున్నారు. కాగా వీరు ముగ్గురు పోలీస్ గెటప్స్ లో దిగిన ఫోటోని అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది. అక్షయ్ సరసన కత్రినా ఖైఫ్ నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చ్ 27న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More